UGC-NET పరీక్షలు.. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరుగుతాయ్

సెల్వి

శనివారం, 29 జూన్ 2024 (13:16 IST)
పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం రాత్రి రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలకు తాజా తేదీలను విడుదల చేసింది. 
 
UGC-NET ప్రస్తుతం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించడం జరుగుతాయని ఎన్టీఏ ప్రకటించింది. 
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) జూన్ 18న నిర్వహించారు. కానీ అవకతవకల కారణంగా రద్దు చేయబడింది. 
 
డార్క్‌నెట్‌లో ప్రశ్నపత్రం లీక్ అయిందని, టెలిగ్రామ్ యాప్‌లో సర్క్యులేట్ అయ్యిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. UGC-NET అనేది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, PhD కోర్సులలో ప్రవేశానికి అర్హతను నిర్ణయించే పరీక్ష.
 
ఈ సంవత్సరం ఈ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో, ఒకే రోజు నిర్వహించబడింది. అయితే, రీషెడ్యూల్ చేయబడిన పరీక్ష పక్షం రోజుల పాటు విస్తరించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ప్రకారం నిర్వహించబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు