ఇలాంటి చర్యలతో తాము త్వరగా పుంజుకునే అవకాశం ఉందని, తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలతో తమను ఎవరూ భయపెట్టలేరని, ఇలాంటి చర్యలకు బెదరబోమని ఆమె స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ఆధారంగా పోయిన నెలలో ఇదే కేసులో సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ స్థానిక కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.