అమ్మాయితో డేటింగ్ కోసం కక్కుర్తిపడిన వృద్ధుడు... తర్వాత ఏం జరిగింది?

గురువారం, 12 డిశెంబరు 2019 (16:54 IST)
నవీ ముంబై ఓ 65 యేళ్ల వృద్ధుడు మోసపోయాడు. అందమైన అమ్మాయితో డేటింగ్ కోసం ఆశపడ్డాడు. ఫలితంగా రూ.73 లక్షలను వదిలించుకున్నాడు. ఈ కేసులో ఓ యువతి, మరో ట్రాన్స్‌జండర్‌తో పాటు మొత్తం ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని ఖర్గార్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన 65 సంవత్సరాల ఓ వృద్ధుడికి డేటింగ్ వెబ్‌సైట్‌లో మెంబర్ షిప్ ఇస్తామని, ఆపై కోరుకున్న ప్రాంతానికి అందమైన అమ్మాయిని పంపిస్తామని స్నేహ అనే యువతి నుంచి ఫోన్ వచ్చింది. 
 
ఇంకేముంది, ఈ వయసులో కూడా అందమైన అమ్మాయితో తన కోర్కె తీర్చుకోవచ్చని ఆశపడ్డాడు. దాన్ని నమ్మిన బాధితుడు గత 2018లో ఆ డేటింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులుకూడా చెల్లించాడు. ఆ తర్వాత నుంచి అతని నుంచి డబ్బులు లూటీ చేయడం ప్రారంభించారు. 
 
అలా, లొకాంటో డేటింగ్ సర్వీసెస్‌లో స్పీడ్ డేటింగ్ మెంబర్ షిప్ పేరిట మరికొంత డబ్బును వారు నొక్కేశారు. ఆపై డేటింగ్‌కు ఎవరినీ పంపకపోవడంతో, తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని అతను కోరాడు. ఆ సభ్యత్వ రద్దు కుదరదని తేల్చి చెప్పిన స్నేహ, అమ్మాయిల కోసం తమను డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ, పోలీసు కేసు పెట్టింది. ఆపై బాధితుడిని భయపెట్టేలా లీగల్ నోటీసులను పంపించింది.
 
వారి వైఖరితో ఆందోళన చెందిన వృద్ధుడు, కేసు బయటకు వస్తే, పరువు పోతుందన్న ఉద్దేశంతో వారు చెప్పినంత మొత్తాన్ని చెప్పిన ఖాతాల్లో జమ చేస్తూ వచ్చాడు. వారి వేధింపులు నానాటికీ పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... నిందితుల ఆచూకీని కనిపెట్టారు. ఈ కేసులో స్నేహ అలియాస్ మహీ దాస్ (25), ప్రబీర్ సాహా (35), అర్నబ్ రాయ్ (26)లను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు