శుభవార్త : పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభం

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (11:37 IST)
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం అయ్యింది. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో పాటు అద్దె ఇళ్లలో నివాసముండే వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే ఐదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇకపై ముందుస్తుగా స్లాట్‌ బుక్‌చేసుకోవాల్సిన అవసరం లేదు. 
 
సాధారణ క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. వారు తమ దరఖాస్తులు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో నేరుగా వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలకు వెళ్లిపోవచ్చు. అంతేకాదు వికలాంగులు (చేతులు పనిచేయని లేదా కోల్పోయినవారు), ఐదేళ్ళ లోపు చిన్నారులకు 'వేలి ముద్ర'లను ఇవ్వాల్సిన నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఇంటి చిరునామా ధృవీకరణ (ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రెస్‌) కింద… సంబందిత అద్దె ఒప్పందాన్ని ఇవ్వవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు