వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలో తప్పులు జరిగిన మాట నిజమేనని, కానీ ఈ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయితీగా రాసిన లక్షలాది మంది విద్యార్థులు జీవితాలు నాశనమవుతాయని ఈ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు తెలిపింది.
నీట్ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. పోటీ పరీక్షలకు పారదర్శక రీతిలో నిర్వహించేందుకు కట్టుబడివున్నామని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేశామని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.