నాలుగో అంతస్తు నుంచి దూకి టీవీ యాంకర్ సూసైడ్...

శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ బుల్లితెర యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాధికా కౌశిక్ టీవీ యాంకర్‌గా కొనసాగుతోంది. ఈమె నోయిడాలోని సెక్షన్ 77లో ఉన్న తమ నివాసంలో నివశిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 3.30గంటల సమయంలో నాలుగో అంతస్తు బాల్కనీలో నుంచి కిందకు దూకేసింది.
 
శుక్రవారం ఉదయం అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో ఓ మహిళ శవాన్ని గుర్తించిన వాచ్‌మెన్... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఆ మృతదేహం ప్రముఖ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న రాధికా కౌశిక్‌ అని తేల్చారు. అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న పోలీసులు... ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించి... శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
రాజస్థాన్‌కు చెందిన రాధికా కౌశిక్... కొన్నాళ్లు అక్కడే ఓ న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా ఉద్యోగం చేసింది. పదోన్నతి ద్వారా నోయిడాకు బదిలీ అయిన ఆమె... కొన్ని నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు రాధికా గదికి ఓ స్నేహితుడు వచ్చినట్టు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అసలేం జరిగిందనే విషయం గురించి విచారణ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు