ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు ఉదయ్ కుమార్ (43) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. ఆయనకు ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.