కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చేదు అనుభవం.. కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:34 IST)
ఆదివారం బీహార్ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆయన కాన్వాయ్‌పైకి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. అయితే, కార్యకర్తలు పోలీస్ భద్రతా బలగాల నుంచి నుంచి తప్పించుకొని మంత్రి కాన్వాయ్‌పై గుడ్లు విసిరారు. 
 
కటక్‌లోని ముండులిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒడిశాకు రాగా.. మంత్రికి వ్యతిరేకంగా ఎన్‌యూఎస్‌యూ నేతలు నల్లజెండాలను ప్రదర్శించగా.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్‌ 3న ఉత్తర్‌ప్రదేశ్‌ అఖింపూర్‌ ఖేరిలో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో.. మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను 9న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
 
మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి దూసుకెళ్లగా.. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రి, ఆయన కుమారుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు