దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. వివాహాలకు కేవలం 25 లేదా 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, ఒరిస్సాకు చెందిన ఓ తహసీల్దార్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించింది.
తన సోదరుడి వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన బరాత్ కార్యక్రమంలో ఆ తహసీల్దార్ మాస్కు ధరించలేదు. అంతేకాకుండా, అక్కడున్న వారితో కలిసి డ్యాన్స్ చేసింది. కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్‌ను అమలు చేస్తోంది.
ఈ వీడియోలపై జాజ్‌పూర్ జిల్లా కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాథోడ్ స్పందించారు. ప్రస్తుతం ఆ మహిళా ఆఫీసర్ సెలవులో ఉన్నారు. సెలవులు ముగిసి వీధుల్లో హాజరైన తర్వాత ఆమె నుంచి వివరణ కోరి, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఆఫీసరే.. నిబంధనలు ఉల్లంఘించడం సరికాదన్నారు.