రాహుల్‌కు సుప్రీంకోర్టు షాక్... మోడీని దొంగ అని మేమన్నామా?

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:05 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ దొంగ అంటూ సాక్షాత్ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నోటీసు జారీ చేసింది. పైగా, ఈనెల 22వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. 
 
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా, తాజాగా 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. అయితే, ఈ ఒప్పందంలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు రాహుల్ గత కొన్నిరోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రఫేల్ పత్రాల ఆధారంగా గతంలో రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది.
 
ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తంచేసింది. చౌకీదార్ చోర్(మోడీ దొంగ) అని సుప్రీంకోర్టే చెప్పిందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో రఫేల్ ఒప్పందంలో ఏదో తప్పు ఉందని తేటతెల్లమైందన్నారు. దీనిపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... రాహుల్‌కు నోటీసు జారీ చేసింది. పైగా, ఈనెల 22వ తేదీన కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు