మనదేశంలో వాతావరణ కాలుష్యం అమాంతం పెరిగిపోతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, రసాయనాలతో ఏర్పడే కాలుష్యంతో పాటు ఇంట్లో వుపయోగించే కట్టెల పొగ కూడా ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇంటి బయటే కాదు.. ఇంట్లోనూ అదే స్థాయిలో కాలుష్యం ఏర్పడుతోంది. కంటికి కన్పించని ఆ కాలుష్య మహమ్మారి అనేక ప్రాణాలను బలితీసుకుంటోంది.
ఇంట్లో ఉపయోగించే కట్టె పొయ్యిల ద్వారా 2015లో మనదేశంలో ఐదులక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కట్టెలు, బొగ్గువంటి ఘనపదార్థాలను మండించడం ద్వారా ఏర్పడే కాలుష్యంతో ఊపిరితిత్తులు, రక్తకణాలు దెబ్బతింటాయని మెడికల్ జర్నల్ లాన్సెంట్ పేర్కొంది.