కర్నాటకలో ఆన్‌లైన్‌ క్లాస్‌ లు రద్దు

గురువారం, 11 జూన్ 2020 (20:06 IST)
ఆన్‌లైన్‌ క్లాస్‌ల వ్యవహారంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదవ తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాస్‌లను రద్దు చేస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

ప్రాథమిక తరగతుల ఆన్‌లైన్‌ క్లాస్‌లపై తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందడంతో.. ప్రైవేట్‌ విద్యాసంస్థలతో పాటు నిపుణులతో చర్చించి ఈ నిర్నయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు.

ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ఫీజులు వసూలు చేయడాన్ని కూడా రద్దు చేసినట్లు తెలిపారు. అయితే పాఠశాలలల్లో తరగతుల నిర్వహించడం కన్నా ఆన్‌లైన్‌ క్లాసులే ఉత్తమమని పలువురు తల్లిదండ్రులు భావిస్తున్నారని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు