గత ఏడాది దేశాన్ని కుదిపేసిన కోట్లాది రూపాయల ఆన్‌లైన్ ట్రేడింగ్ కుంభకోణంలో వివాదాస్పద అస్సామీ నటి సుమి బోరా, ఇతర సహ నిందితులపై సిబిఐ కోర్టుకు కొత్త డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించింది. నటి బోరా, ఆమె భర్త తార్కిక్ బోరా.. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బిషల్ ఫుకాన్‌లపై కేంద్ర దర్యాప్తు సంస్థ తగినంత కొత్త డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ట్రేడింగ్ స్కామ్ కేసులో నిందితులైన ముగ్గురికి ఇంకా బెయిల్ రాలేదని, వారు జైలు నుండి బయటకు రావడం చాలా కష్టం కావచ్చు.