ఇంట్లో టీవీవుందా... అయితే రేషన్ కార్డు కట్ : కర్నాటక సర్కారు నిర్ణయం

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (07:33 IST)
కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కోట్లాది మంది పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇంట్లో టీవీ, ఫ్రిజ్ వంటి వస్తువులు ఉంటే రేషన్ కార్డు ఎత్తేవేస్తామని ప్రకటించింది. 
 
టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం కలిగి ఉండి రేషన్ కార్డుకు అనర్హులైనా కూడా రేషన్ కార్డు పొందిన వారు వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పాలని తేల్చి చెప్పింది. అలా చేయని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. 
 
ముఖ్యంగా, అనర్హులందరూ తమ రేషన్ కార్డులను మార్చి 31లోపు ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ డెడ్‌లైన్‌ విధించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సోమవారం నాడు బెళగావిలో కీలక ప్రకటన చేశారు.  
 
'రేషన్ కార్డులను పొందేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. రేషన్ కార్డు దారులకు ఐదు ఎకరాలకు మించి భూమి ఉండకూదు. అలాగే వారి వద్ద టీవీ, ఫ్రిజ్, టూ వీలర్ కూడా ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తూ రేషన్ కార్డు కలిగి ఉన్న వారు వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి' అని బెళగావిలో జరిగిన పత్రికాసమావేశంలో మంత్రి ప్రకటించారు. 
 
అలాగే, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.20 లక్షలకు మించిన వారెవరూ రేషన్ కార్డుకు అర్హులు కారని తెలిపారు. మార్చి 31లోగా వీటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అలా చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు