అందరికంటే ముందుగా కొత్త యేడాదిలోకి ప్రవేశించిన దేశం ఏది?

ఆదివారం, 1 జనవరి 2023 (09:44 IST)
ప్రపంచ దేశాలు కొత్త యేడాదిని ఘనంగా స్వాగతించాయి. 2022 సంవత్సరానికి టాటా చెప్పేస్తూ, 2023 సంవత్సరానికి స్వాగతం పలికాయి. అయితే, అందరికంటే ముందుగా కొత్త సంవత్సరాన్ని కిరిబాటి దేశం స్వాగతం పలికింది. ఆ తర్వాత టొంగా, సమోవా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. 
 
తొలుత కిరిబాటి, టొంగా దేశాలు నూతన సంవత్సరాదికి ఆహ్వానం పలుకగా ఆ తర్వాత సమోవా దేశస్తులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సమోవా తమ టైమ్ జైన్‌ను మార్చుకోవడంతో గంట ఆలస్యంగా 2023ను స్వాగతించాయి. 
 
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త యేడాదిలోకి అడుగుపెట్టింది. రంగురంగుల బాణాసంచా విన్యాసాలతో అక్లాండ్ నగరంలోని స్కై టవర్ కాంతులు విరజిమ్మింది. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటూ స్వాగతం పలికాయి.
 
తెలుగు రాష్ట్రాల స్వాగతం..
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2023 కొత్త సంవత్సరానికి మిరుమిట్లు గొలిపే వేడుకలతో స్వాగతం పలికారు. అదేసమయంలో 2022 సంవత్సరానికి బైబై చెప్పారు. కొత్త సంవత్సర వేడుకలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఘనంగా జరిగాయి.
 
విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఆయా ప్రాంతాల వాసులు అర్థరాత్రి ఇళ్ల నుంచి బయటకు వచ్చి కేక్‌ కట్‌ వేడుకలు, కమ్యూనిటీ కార్యక్రమాలు, రంగురంగుల రంగోలీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
 
మరోవైపు కొత్త సంవత్సరం రోజు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు, కొత్త సంవత్సర వేడుకల ఫోటోలు మరియు వీడియోలతో ఇంటర్నెట్ సందడి చేస్తోంది.
 
మరోవైపు, అనేక ప్రపంచ దేశాలు 2023 సంత్సరానికి స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సరాదిని అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ నగరం బాణాసంచా వెలుగులతో నిండిపోయింది.
 
కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగులు బాణాసంచా ఆకాశంలో అద్భుతమైన వర్ణచిత్రాన్ని ఆవిష్కరించింది. లేజర్ లైటింగ్, విద్యుద్దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో సిడ్నీ హార్బర్, ఐకానికి ఓపెర్ హౌస్, సిడ్నీ బ్రిడ్జి కనువిందు చేశాయి. 
 
అలాగే, హార్బర్ వంతెనపై 7 వేల రకలా బాణాసంచా కాల్చారు. ఓపెరా హౌస్ వద్ద 2 వేల రకాల బాణా సంచా కాల్చారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఇక్కడ బాణాసంచా విన్యాసాలు చేపట్టలేదు. ఓ వైపు లైవ్ మ్యూజిక్ వినిపిస్తుండగా సిడ్నీ వాసులు న్యూ ఇయర సంబరాలు జరుపుకున్నారు. అలాగే మెల్‌‍బోర్న్ నగర వాసులు కూడా కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు