పాకిస్థాన్ - బంగ్లాదేశ్ బెట్టర్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

మంగళవారం, 2 అక్టోబరు 2018 (16:41 IST)
కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. ఇది దేశీయంగా వివాదాస్పదమైంది. దీనిపై సిద్ధూనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
 
ఈ పరిస్థితుల్లో దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఆయన స్పందించారు. పెట్రోల్ ధరలు పాకిస్థాన్, బాంగ్లాదేశ్‌లలో మనకంటే తక్కువగా ఉన్నాయన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం... చమురు కంపెనీలకు లాభాలను అందిస్తోందన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఒకటని, చేస్తున్నది మరొకటన్నారు. గత కొన్ని వారాలుగు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ముంబై‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటింది. పెరుగుతున్న పెట్రో ధరలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... విపక్షాలు విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీ పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు