ఇకపోతే.. బీజేపీకి రాజకీయ నేతల అభినందలు వెల్లువల్లా వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఈ ఫలితం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల విశ్వాసాన్ని మరోసారి రుజువు చేస్తోందని అన్నారు. మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఆయన పాలన నడిపిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఆర్థిక అవకతవకలను తొలగించి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే పాలనా నమూనాను ఢిల్లీ ప్రజలు విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో బిజెపి విజయం నగరవాసులు మోడీ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పవన్ అభివర్ణించారు.