అకీరా, అన్నాతో మోదీని కలిసిన పవన్ కల్యాణ్

సెల్వి

గురువారం, 6 జూన్ 2024 (17:31 IST)
Pawan_Akira
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - ఆయన కుటుంబం తన పెద్ద కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అకీరా భుజంపై చేయి వేయడం.. చనువుగా మాట్లాడుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. 
PawanKalyan
 
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన తనయుడు అకీరా నందన్‌‌‌ను త్వరలోనే సినీరంగంలో అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు