చమురు సంక్షోభంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర నేడు 22 పైసలు పెరిగి.. రూ.74.13కి చేరింది. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.80కి చేరువలో ఉంది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో వరుసగా ఎనిమిదో రోజు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర నేడు 22 పైసలు పెరిగి.. రూ.74.13కి చేరింది. లీటర్ డీజిల్ ధర 14 పైసలు పెరిగింది.