భీమవరం, ఏలూరు, గుడివాడ, నెల్లూరు, విజయనగరం తపాలా డివిజన్లలో ఈ సేవలు ఇప్పటివరకు ఎక్కువగా అందాయి. పోస్టుమ్యాన్ల వద్ద ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. దాని సాయంతో వారు వినియోగదారుల మొబైల్ నంబరును ఆధార్ కార్డుకు అనుసంధానిస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సాయంతో గ్రామీణ తపాలా సేవకులు వినియోగదారులను చేరుకుంటున్నారు. తమకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఇంకా సుమారు 1.92 కోట్ల ఆధార్ కార్డుల ఫోన్‌నంబర్లు అప్‌డేట్ చేయాల్సి ఉందని ఏపీఎంజీ సుధీర్‌బాబు తెలిపారు.