నిరాశ్రయులకు భోజన సౌకర్యం: న‌గ‌ర మేయ‌ర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

శనివారం, 5 జూన్ 2021 (10:12 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో నగరపాలక సంస్థ పర్యవేక్షణలో నిరాశ్రయులకు ఆహారం అందించేందుకు ప‌లు స్వ‌చ్ఛంధ సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయ‌ని వారి సేవాలు అద‌ర్శ‌నీయం అని న‌గ‌ర పాల‌ర సంస్థ మేయ‌ర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు.
 
శుక్ర‌వారం నగరంలోని కెనాల్ రోడ్డు రథం సెంటర్ వ‌ద్ద నిరాశ్రయులకు  జైన్ ఇంట‌ర్ నేష‌న‌ల్ ట్రేడ్ ఆర్గ‌నేష‌న్ (JiTo)  సంస్థ ఏర్పాట్లు చేసిన భోజ‌న ప్యాకేట్లును మేయ‌ర్ చేతుల మీదుగా వారికి అంద‌జేశారు. క‌రోనా కార‌ణంగా నగరంలో అనేక మంది నిరాశ్రయులు భోజనం లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వారికి  పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ద్వారా నగరపాలక సంస్థ పర్యవేక్షణలో  దాదాపు 400 మందికి ర‌థం సెంట‌ర్‌, పున్న‌మిఘాట్‌, భ‌వానీపురం, సొరంగం, చిట్టిన‌గ‌ర్  త‌దిత‌రు ప్రాంతాల్లో ఈ విధంగా భోజ‌నం అంద‌జేస్తున్న‌ట్లు వివ‌రించారు.
 
కార్య‌క్ర‌మంలో 53వ డివిజ‌న్  కార్పొరేట‌ర్ మహాదేవు అప్పాజీరావు, నగరపాలక సంస్థ వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా.రవిచంద్   మ‌రియు సంస్థ నిర్వాహ‌కులు అశోక్ జైన్‌, మ‌ర్ష‌జైన్‌, అన‌క జైన్,  ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు