చెన్నై అపోలో ఆస్పత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్న ‘అమ్మ’ మాట్లాడారంటూ ఒక ఆడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం జయలలిత కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పేందుకు ఈ ఆడియోనే సాక్ష్యం అంటూ అన్నాడీఎంకే అభిమానులు చెబుతున్నారు. వాట్సప్‌లో దీనికి సంబంధించిన ఆడియో ఫైలు విపరీతంగా షేర్ అవుతోంది.
అందులో జయలలిత మాట్లాడినట్లుగా చెబుతున్నా.. నిజానికి ఇది అమ్మగొంతులా అనిపించడం లేదని కొందరి అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆస్పత్రిలో బెడ్ మీద ఉండి మాట్లాడడం వల్ల గొంతు కొంచెం మారి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.