అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్.. దివ్యాస్త్రపై సైంటిస్టులపై ప్రశంసలు

సెల్వి

సోమవారం, 11 మార్చి 2024 (19:25 IST)
PM Modi
అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. తద్వారా భారత్ రక్షణ రంగ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) టెక్నాలజీ వినియోగించారు. 
 
మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డీఆర్డీవో సైంటిస్టులను అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టును మిషన్ దివ్యాస్త్రగా పేర్కొంటున్నారు. 
 
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా అగ్ని-5 పరీక్షపై స్పందించారు. ఇక నుంచి భారత్‌పై ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు