ఉరి ఎలా వేసుకుంటారు అని భార్యకు చూపించాలని ప్రయత్నించి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకున్నాడు ఓ భర్త. వినడానికే వింతగా ఉన్నా ఇది పచ్చి నిజం. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ముంబైకి చెందిన గోవింద్ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన గోవింద్‌తో... అతని భార్య బట్టలు ఉతికాను.. వీటిని ఆరేడానికి తాడు కట్టండి అని అతడి చేతికి తాడిచ్చింది.
భార్య చెప్పినట్టుగానే తాడు కట్టాడు. వెర్రి వెయ్యి రకాలు కదా... ఇంతలో గోవిందుకి ఒక వింత ఆలోచన కలిగింది. పోలీసుశాఖలో ఉరి ఎలా వేస్తారో చూపిస్తా... అని చెప్పి డెమో ఇవ్వడం ప్రారంభించాడు. ఒక కొక్కానికి చీర కట్టేసి అందులో తలపెట్టాడు. అయితే ప్రమాదవశాత్తూ అతను వేసుకున్న స్టూల్ పక్కన పడిపోయింది.. అంతే గొంతు బిగుసుకుపోయి గిల గిలా కొట్టుకోవడం మొదలు పెట్టాడు.. దీన్ని చూసిన భార్య ఊరికే చేస్తున్నాడులే అనుకుని నవ్వుతూ కూర్చుంది.