తెలుగు సినిమా చరిత్రలో అనేక మంది దర్శకులు, నిర్మాతలు, కళాకారులు తమ అద్వితీయ కృషితో సినిమా ప్రపంచాన్ని మార్చి, వినోదం, సందేశాలను ప్రేక్షకులకు అందించారు. అటువంటి మహనీయులలో కోడి రామకృష్ణ గారు ఒకరు. ఆయన తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అనే కొత్త డైమెన్షన్ ను తీసుకువచ్చి, సినిమా ప్రపంచాన్ని ఎప్పటికీ మార్చివేసిన దర్శకుడు. ఈరోజు తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అంటే అది ఆరోజు అయన వేసిన పునాదే.. అలాంటి కోడి రామకృష్ణ:6 వ వర్ధంతి నేడే.. ఈ సందర్భంగా ఒకసారి గుర్తుచేసుకుందాం.