ఈ సందర్భంగా 1857లో మొదలైన మన స్వాతంత్ర్యోద్యమం 90 ఏళ్ల తర్వాత ముగిసింది. మనం బ్రిటిష్ వారిని వెళ్లగొట్టగలిగాం. స్వాతంత్ర్యోద్యమ నాయకులకు సెల్యూట్.. ఈ ఉద్యమ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిత్ (నెహ్రూ), భగత్‌సింగ్, రాజ్‌గురులను ఉరితీశారు.. అని జవదేకర్ అనడంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు.
విద్యాశాఖ మంత్రి చరిత్రను ఇలా ఎలా వక్రీకరించారో అర్థం కాలేదు. మన మొదటి ప్రధాని నెహ్రూ 74 ఏళ్ల వయసులో సహజ మరణం పొందారు. మొదటి హోంమంత్రి పటేల్ కూడా 75 ఏళ్ల వయసులో మరణించారు. సుభాష్ చంద్రబోస్ మరణం ఇంకా మిస్టరీగానే ఉంది. భగత్‌సింగ్, రాజ్‌గురులను మాత్రమే 1931లో ఉరితీశారు. తిరంగా యాత్రలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత తన వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇవ్వడం గమనార్హం.