ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

డీవీ

మంగళవారం, 19 నవంబరు 2024 (16:38 IST)
Johnny Master
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ డాన్సర్ పై లైంగికవేధింపులు కేసులో కొద్దిరోెజులపాటు జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటినుంచి ఆచితూచి స్పందిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయడంలేదు. కాగా, నిన్న రాత్రి జరిగిన కె.సి.ఆర్. అనే సినిమా ప్రీరిలీజ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన భార్య వల్లే తాను నిలబడి వున్నానంటూ పేర్కొన్నారు.
 
జానీ మాస్టర్ మాట్లాడుతూ, భర్తకు భార్య దీవెన ఖచ్చితంగా వుంటుంది. జీవితంలో ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంటుంది. అలాగే సుజాత కూడా రాకింగ్ రాకేశ్ వెనుక నిలబడ్డారు. మీ కష్టానికి తగిన ఫలితం వుండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
 
ఇదేవేడుకకు వచ్చిన రోజా మాట్లాడుతూ.. రాకేష్ నాకు జబర్దస్త్ లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటూ చిన్న పిల్లల్లాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. కెసిఆర్ అంటే మా రాకేష్ కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయడంతోపాటు తెలంగాణపై తనకున్న ప్రేమని ఈ సినిమాలో చూపిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. బలగం సినిమాలనే ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. తన సంపాదించిన ప్రతి రూపాయిని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు. తన ఇంటిని కూడా త్యాగం చేశాడు. రాకేష్ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేస్తూ ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు