గౌరీ లంకేశ్‌ను ''కుక్క'' అని నేరుగా ప్రస్తావించలేదు.. ప్రమోద్ ముథాలిక్ వివరణ

సోమవారం, 18 జూన్ 2018 (09:27 IST)
ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో హత్యకు గురైన గౌరీ లంకేశ్‌ను ''కుక్క'' అంటూ సంబోధించారు. లంకేశ్ హత్య కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని, మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయని.. అప్పుడెవరూ కాంగ్రెస్‌ను తప్పుబట్టలేదని.. కానీ కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మాత్రం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రమోద్ ముథాలిక్ మాటలు వినగానే కార్యకర్తలు కొందరు జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 
 
అయితే ప్రమోద్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆయన కాస్త వెనక్కి తగ్గారు. కర్ణాటకలో జరిగే ప్రతీ హత్యకు మోదీ స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే అలా అన్నానన్నారు. లంకేశ్‌ను నేరుగా కుక్క అని ప్రస్తావించలేదని వివరణ ఇచ్చుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు