హిందూ ప్రజలు ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వెనక్కి తగ్గారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాణలు చెప్పారు. మహిళలను వేధించేవారి భరతంపట్టేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్లపై ఆయన స్పందిస్తూ "రోమియో కేవలం ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. మరోవైపు కృష్ణుడు పేరుమోసిన ఈవ్ టీజర్ (అమ్మాయిలను ఏడిపించేవాడు). ఈ లెక్కన యోగి ఆదిత్యనాథ్‌కు తన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను యాంటీ కృష్ణా స్క్వాడ్స్ అనే దమ్ముందా?" అంటూ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే.