కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ఠాగూర్

గురువారం, 28 నవంబరు 2024 (15:13 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించారు. దీంతో ఆమె గురువారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకోసం ఆమె కేరళ సంప్రదాయ చీరకట్టులో సభలో తొలిసారి అడుగుపెట్టారు. ఆమె చేత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక గాంధీ ప్రమాణం చేశారు. 
 
కేరళ సంప్రదాయ ఓనం చీరను ధరించిన ఆమె పార్లమెంట్‌కు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెన పార్లమెంట్‌కు తోడ్కుని వచ్చారు. కాగా, వయనాడ్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ 4.10 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు మొత్తం 6.22 లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. 
 
అలాగే, నాందేడ్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావ్ చవాన్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాల కార్యక్రమం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వాని వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో ఉభయసభలను సభాపతులు వాయిదా వేశారు. 

 

నానమ్మ ఇందిర లుక్‌లో కనిపించిన ప్రియాంక గాంధీ!..
కేరళ సాంప్రదాయాన్ని అనుసరించి క్రీమ్ కలర్ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ పార్లమెంటు హౌస్‌కి చేరుకున్నారు. ప్రియాంక కేరళ కాటన్ జారీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిభించేలా లోక్‌సభకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ… pic.twitter.com/0Nwfdsif3L

— TV9 Telugu (@TV9Telugu) November 28, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు