గుంజీలు తీస్తానంటున్న ముఖ్యమంత్రి... ఎందుకో తెలుసా?

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (16:37 IST)
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల ముందు వంద గుంజీలు తీస్తానంటోంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
దేశ వ్యాప్తంగా త్వరలోనే దసరా శవన్నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ యేడాది కరోనా మహమ్మారి కారణంగా బెంగాల్ రాష్ట్రంలో దుర్గా పూజలకు అనుమతి లేదని, ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై మమతా బెనర్జీ ఘాటుగా స్పదించారు. ఈ యేడాది దుర్గా నవరాత్రులకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించిందని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
 
'దుర్గా పూజా విషయంలో రాజకీయ పార్టీ రకరకాలైన అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై తాము ఎలాంటి సమావేశమూ పెట్టలేదు. ఈ యేడాది దుర్గా పూజను రద్దు చేస్తున్నట్లు తాము ప్రకటించామని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నాం' అని ఆమె ప్రకటించారు. 
 
ఈ విషయంలో సోషల్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని గుర్తించి, వంద గుంజీలు తీయించండని పోలీసులను సీఎం ఆదేశించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మత సహనం దెబ్బతింటోందని ఆమె మండిపడ్డారు. కాళీ, దుర్గా, హనుమాన్ పూజలు చేయని వారు కూడా పూజ గురించి మాట్లాడేస్తున్నారని సీఎం మమత మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు