ఫ్రీక్వెన్సీ స్ప్రెక్టంలో విస్తరించిన సి బ్యాండ్ సేవలను అందించేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నామని, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లకు కూడా దీని పరిమితి విస్తరించనుందని అధికారులు వివరించారు. ఇది షార్ నుంచి జరుగుతున్న 77వ ప్రయోగం కావడం గమనార్హం. సిఎంఎస్ భారతదేశపు 42 వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. పిఎస్‌ఎల్‌వి - సి 50 ఎక్స్‌ఎల్ ఆకృతిలో 22 వది అని ఇస్రో పేర్కొంది.