ఈ భారీ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం పుల్వామా జిల్లాలోని రాజ్‌పోరాలో ఐఈడీ బాంబులతో నిండి ఉన్న కారును సీజ్ చేశారు. వాటిని నిర్వీర్యం చేసి పేలుడు ముప్పును తప్పించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.