సముద్ర జలాల నుంచి ప్లాస్టిక్‌ను తొలగించే షిప్... పూణె కుర్రోడి సృష్టి

బుధవారం, 23 జనవరి 2019 (14:45 IST)
నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం ఇపుడు మానవజాతి మనుగడకే పెను ప్రమాదంగా మారింది. భూమిపై వుండేవాటికేకాకుండా, సముద్ర గర్భంలో ఉండే మిగిలిన జీవరాశులకు కూడా హానికరంగామారింది. దీంతో మానవ మనుగడకేకాకుండా, సముద్ర జలచరాల మనుగడే ప్రమాదకరంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో సముద్ర జలాలను శుభ్రం చేసేందుకు వీలుగా 12 యేళ్ళ బుడతడు ఒకడు నౌకను డిజైన్ చేశాడు. ఆ కుర్రోడి పేరు హాజిక్ కాజీ (12). ఈ నౌకకు ఇర్విస్‌గా నామకరణం చేశాడు. తన ఆలోచనను అంతర్జాతీయ వేదికలైన టెడ్ ఎక్స్, టెడ్ 8 పై పంచుకున్నాడు. 
 
ఈ నౌక డిజైన్‌పై కాజీ స్పందిస్తూ, 'వ్యర్థాలు ఏ విధంగా సముద్ర జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయో పలు డాక్యూమెంటరీలు చూశా. సమస్య పరిష్కారానికి నా వంతుగా ఏదైనా చేయాలని అనుకున్నా. మనం ఏవైతే సముద్ర ఉత్పత్తులు తింటున్నామో అవి ప్లాస్టిక్ తింటున్నాయి. ఇదో చక్రంలాగా ప్లాస్టిక్ తిరిగి ఆహారంగా మనల్నే చేరుతుందని చెప్పారు.
 
దీనికి పరిష్కారంగా తాను ఇర్విస్‌కు డిజైన్ చేసినట్లు బాలుడు వెల్లడించాడు. తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడే తనకు ఈ ఆలోచన వచ్చిందన్నాడు. సముద్ర జలాల్లో ప్రయాణించే ఈ షిప్ నీటితో పాటు వ్యర్థాలను స్వీకరిస్తుంది. నీటిని తిరిగి విడుదల చేసి సేకరించిన వ్యర్థాలను ఐదు భాగాలుగా విడగొడుతుంది. షిప్ అడుగుభాగంలో అమర్చిన సెన్సార్ల అమరిక ద్వారా ఈ ప్రక్రియంతా జరుగనున్నట్లు వివరించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు