పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన సీనియర్ నేత సూచా సింగ్ లంగాహ్ (57)పై రేప్ కేసు నమోదైంది. భర్త చనిపోయిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. భర్త చనిపోయిన తనకు ఉద్యోగమిప్పిస్తానని శారీరకంగా వాడుకుని, ఆర్థికకంగా కూడా మోసం చేశాడంటూ ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై పంజాబ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే..
39 ఏళ్ల ప్రభుత్వ మహిళా ఉద్యోగిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను మాజీమంత్రి లంగాహ్‌ను 2009లో కలిశానని అనంతరం యేడాదికే తన భర్త మరణించాడు. ఆ తర్వాత తనకు ఉద్యోగమిప్పిస్తానని చెప్పి తనను శారీరకంగా వాడుకోవడమేకాకుండా తన ఆస్తులను విక్రయించి డబ్బు తీసుకొని మోసం చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, సూచీ రెండు సార్లు ప్రజాపనుల, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయనపై రేప్ కేసు నమోదు కావడంతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షపదవికి, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీలకు రాజీనామా చేశారు.