బాయ్‌ఫ్రెండ్ వ్యవహారం అమ్మకు చెబుతాడనీ... తమ్ముడిని ఊపిరాడకుండా చేసి...

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (09:35 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో దారుణం జరిగింది. అక్క సొంత తమ్ముడుని కడతేర్చింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో తాను కొనసాగిస్తున్న ప్రేమ వ్యవహారం అమ్మకు చెబుతాడని భావించి తమ్ముడుని చంపేసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లూథియానా నగరానికి చెందిన రేణు కనోజియా (19) అనే యువతి తమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడుతో ప్రేమలో పడింది. రేణుకకు అన్షు కనోజియా అనే నాలుగేళ్ల వయసున్న సోదరుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో రేణుక తన బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉండటాన్ని చూశాడు. ఈ విషయాన్ని అమ్మకు చెబుతాడనే భయంతో రేణుకా తమ్ముడిని ఊపిరాడకుండా చేసి హతమార్చింది. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్య కేసు మిస్టరీని చేధించారు. 
 
తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారికి చెబుతాడనే భయంతోనే తమ్ముడిని హత్య చేశానని రేణుక పోలీసుల ముందు అంగీకరించింది. దీంతో పోలీసులు నిందితురాలైన రేణుకను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు