హర్యానాలోని హిషార్ విమానాశ్రయంలోకి పెద్ద కొండచిలువ ప్రవేశించింది. కొండచిలువ గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో విమానాశ్రయం క్యాంపస్‌లోకి ప్రవేశించగానే అక్కడి ఉన్న భద్రతా సిబ్బంది గుర్తించారు.
కొండచిలువ పొడవు చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ అధికారుల సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారి రామేశ్వర్ దాస్ బృందం అక్కడి చేరుకొని 45 నిమిషాలు పాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. కొండ చిలువను చూడగానే అటవీశాఖ అధికారులు గుండె ఆగినట్టుగా అనిపించదన్నారు.
12 అడుగుల పొడవైన ఇలాంటి కొండచిలువలు భారతదేశపు అడవుల్లో ఉంటాయని, విషపూరితం కాదని, చిన్నపాటి జంతువులను ఇవి వెంటనే మింగేస్తాయని వివరించారు. ఆ కొండ చిలువను తిలియార్ జూపార్క్‌కు తరలించారు.