రాహుల్ నుదుట వీర తిలకం దిద్దిన ప్రణబ్

సోమవారం, 4 డిశెంబరు 2017 (14:55 IST)
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరతిలకం దిద్దారు. రాహుల్ నెత్తిన పువ్వుపెట్టి, ఆయన నుదుట వీర తిలకం దిద్దారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు ఘట్టానికి పార్టీలోని అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. 
 
వీళ్లందరి కంటే ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఆసక్తి రేపుతోంది. పార్టీ ఆఫీస్ నుంచి నామినేషన్ వేయటానికి బయలుదేరే ముందు.. రాహుల్ ప్రణబ్ ముఖర్జీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ నుదిటిన వీర తిలకం దిద్దారు. నెత్తిన పువ్వుపెట్టి ఆశీర్వదించారు. ప్రణబ్ ఇచ్చిన మద్దతు కాంగ్రెస్ నేతలకు ఫుల్ జోష్ నింపింది. 
 
రాష్ట్రపతి కాకముందు పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన దాదాకు రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సూచనలు, సలహాలు ఇస్తున్న సంగతి తెలిసింది. రాహుల్ అధ్యక్ష పీఠం ఎక్కుతున్న టైంలో ప్రణబ్ ఇచ్చిన ఆశీర్వాదం గొప్పదిగా పార్టీ నేతలు ఫీలవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు