కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారు. ఇందులోభాగంగా, ఆయన దేశ వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన కన్నియాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. అక్టోబరు రెండో తేదీ నుంచి ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారం చుడుతారు.