భట్టి విక్రమార్క పాదయాత్ర.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు?

శుక్రవారం, 25 మార్చి 2022 (11:54 IST)
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మధిర నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం నుంచి ఈ యాత్ర పునః ప్రారంభం కానుంది. 
 
ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి భట్టి విక్రమార్క శుక్రవారం నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. 
 
అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడటంతో తిరిగి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు మధిర నియోజకవర్గం లోని చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని అన్ని గ్రామాల్లో కాలి నడక ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి భట్టి విక్రమార్క తన పాదయాత్రను శుక్రవారం నుంచి నిరవధికంగా కొనసాగించనున్నారు. 
 
పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ఫిబ్రవరి 27న ఆదివారం రోజు ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమై ఈ నెల 5న గంధసిరి గ్రామం వరకు కొనసాగింది.
 
సుమారు 102 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి 15 వరకు ఉండడంతో తాత్కాలికంగా వాయిదా పడిన విషయం విదితమే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు