రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్‌డౌన్ అయి రోడ్డు పక్కన ఆగివున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. అలాగే, మంగళవారం కూడా ఇదే రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
గుజరాత్ నుంచి మధురకు కొందరు ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒకటి జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ అయి రోడ్డుపక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి అమిత వేగంతో వచ్చిన ఓ ట్రక్.. ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న ప్రయాణికుల్లో 11 మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇదే రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.