పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

ఠాగూర్

మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (19:25 IST)
తన నివాసంలో పూజ చేస్తున్న సమయంలో మంటలు వ్యాపించడంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత గిరిజా వ్యాస్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంలో గాయాలయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని తన నివాసంలో సోమవారం పూజ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. 
 
పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తుండగా, ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అమెను అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. 
 
ఇట్లో ఆమె హారతి ఇస్తుండగా దీపం నుంచి మంటలు ఆమె దపట్టాకు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ తెలిపారు. గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గానూ పనిచేశారు. 

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!! 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ ప్రేమకథలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. తన భార్యను భర్త ఆమె ప్రియుడుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత వధూవరులిద్దరూ వారి ఇంటికి వెళ్లారు. అయితే, కోడలిని రెండో భర్త అమ్మ (అత్తగారు) మొదటి భర్త దగ్గరికి తిప్పి పంపించింది. అలాగే, తన వద్దకు వచ్చిన భార్యను మొదట భర్త మళ్లీ అక్కున చేర్చుకున్నాడు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో ఇటీవల ఓ షాకింగ్ ప్రేమకథ జరిగిన విషయం తెల్సిందే. తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో మొదటి భర్త బబ్లూ దగ్గరుండి పెళ్లి చేశాడు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందన్న భయంతోనే తన భార్యను ఆమె ప్రియుడుకిచ్చి వివాహం జరిపించినట్టు బబ్లూ చెప్పాడు. 
 
అయితే, తన ఇంటికి వచ్చిన కోడలు రాధికకు అత్త అయిన వికాస్ తల్లి తేరుకోలేని షాకిచ్చింది. రాధికను తిరిగి ఆమె మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. రాధికకు రెండో పెళ్లి చేశాక, తన వల్ల ఆమెకు కలిగిన ఇద్దరు పిల్లల పెంపకం బాధ్యతలను బబ్లూయే తీసుకున్న విషయంతెల్సిందే. పైగా, వివాహమైన వెంటనే రాధిక తన పిల్లలతో పాటు భర్తను వదిలివేసి రెండో భర్త వికాస్‍‌తో వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో విసాస్ తల్లి కీలక నిర్ణయం తీసుకుంది రాధిక భర్త బబ్లూ, అతడి పిల్లల మానసికక్షోభ గురించి ఆలోచి నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరకు వెళ్లాలని రాధికను ఒత్తిడి చేశాను. దీంతో ఆమె మొదటి భర్త వద్దకు వెళ్లింది" అని వికాస్ తల్లి చెప్పింది. కాగా, తన వద్దకు వచ్చిన రాధికను మొదటి భర్త బబ్లూ మళ్లీ స్వీకరించాడు. భవిష్యత్‌లో రాధికకు ఏమైనా ప్రమాదం జరిగితే దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇపుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు