ధోని వెళ్ళిపోవడాన్ని చూసి, రాయల్స్ సొంత మైదానం అయినప్పటికీ, గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారింది. మాస్టర్ ఎంఎస్ ధోని బ్యాట్ నుండి మరో విజయవంతమైన ఛేజింగ్ చూడాలని అభిమానులు ఆశించారు. కానీ హెట్మెయర్ డీప్ మిడ్-వికెట్ బౌండరీ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ తీసుకోవడం ద్వారా అలా జరగకుండా పోయింది.
ధోని 10 బంతుల్లో 16 పరుగులు చేసి, సందీప్ వేసిన యార్కర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి ఓవర్లో 20 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన చెన్నైకి అతను క్రీజులో ఉండటం చాలా ముఖ్యం. మధ్యలో ధోని, జడేజా ఉన్నారు. కానీ ధోనీ అవుట్ కావడంతో చివరికి, సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇలా ధోని అవుటై మైదానం వీడి వెళ్ళిపోతున్నప్పుడు, స్టాండ్ల నుండి ఒక మహిళా అభిమాని స్పందన వైరల్ అయింది. ధోని క్యాచ్‌ను హెట్‌మైర్ పట్టుకున్నప్పుడు అభిమాని నిరాశను వ్యక్తం చేయడం ఇంటర్నెట్‌లో మీమ్‌లకు సోర్స్‌గా మారింది.