చిన్నారిపై అత్యాచారం.. 9రోజుల్లో తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

బుధవారం, 6 అక్టోబరు 2021 (14:47 IST)
అత్యాచారాల కేసుల్లో తీర్పుల్లో జాప్యం మామూలే. కానీ ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులు కోర్టు కేవలం తొమ్మిది రోజుల్లో తీర్పునివ్వటం అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రూ.20సంవత్సరాల జైలుశిక్ష విధించటం ఓ సంచలనంగా మారింది. రాజస్థాన్‌లో మాత్రం ప్రత్యేక కోర్టు తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కేవలం తొమ్మిది రోజుల్లో తీర్పుని వెల్లడించటం గమనించాల్సిన విషయం.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని బాలికపై జరిగిన అత్యాచారం కేసుని ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 9 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధించింది. 9 ఏళ్ల బాలికపై 25ఏళ్ల కమలేశ్‌ మీనా అనే వ్యక్తి సెప్టెంబర్‌ 26న అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు హుటాహుటిన రంగరంలోకి దిగారు. అత్యాచారం జరిగిన మరుసటిరోజు ఉదయమే నిందితుడిని అరెస్టు చేయటం అనంతరం ఏమాత్రం ఆలస్యం చేకుండా కేవలం 18 గంటల్లోనే కేసు నమోదు చేయటం..కేసుకు సంబంధించి అన్ని వివరాలు సేకరించి కోర్టులో చార్జిషీటు దాఖ లు చేయటం అంతా వెంట వెంటనే జరిగిపోయాయి.
  
అలా..చలాన్‌ నమోదైన ఐదు వర్కింగ్ డేస్ లోనే జైపూర్‌ మెట్రోపాలిటన్‌ సిటీ పోక్సో 3వ నంబర్‌ కోర్ట్‌ సంచలన తీర్పును వెల్లడించింది. నిందితుడిగా ఉన్న వ్యక్తి బాలిక అత్యాచారం కేసులో దోషిగా తేలింది. దీంతో న్యాయమూర్తి వికాష్ కుమార్ దోషి కమలేశ్‌కు రూ. 2 లక్షల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తు సంచలన తీర్పునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు