దీనిపై విచారణాధికారి దువ్వాడ సిఐ లక్ష్మి మాట్లాడుతూ, బాలిక మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసామన్నారు. అదిత్య నివాస్ 4 పోర్ల్ నుండి బాలిక దూకి చనిపోయిందని ప్రాధమికంగా నిర్థారణకు వచ్చామని, పై నుండి దూకడం వల్ల కాలు విరిగిపోయి, తలకు బలమైన గాయం ఖావడంతో మృతి చెందిందని తెలిపారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పెట్ట ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చింది. కూర్మన్నపాలెం శనివాడ వద్ద ఆదిత్య అపార్ట్మెంట్లో వాచ్ మెన్ గా చేరారు. ఈ దశలో వారి కుమార్తె పద మూడేళ్ల కీర్తన నిన్నసాయంత్రం నుంచి కనిపించ లేదు. కుటుంబ సభ్యులు వేరువేరు ప్రాంతాల్లో వెదికారు. ఈ రోజు తెల్లవారుజామున పక్క అపార్ట్మెంట్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది. ఎవరైనా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతదేహం అక్కడి నుంచి తీయకుండా ఆందోళన బాట పట్టారు. ఆమె తన మేనమామ వాచ్ మెన్ గా పనిచేస్తున్న అపార్ట్మెంట్ పై నుండి దూకింది. ఎందుకు వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? అసలు ఏం జరిగింది అన్న దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.