బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలి యువకుడు మృతి

శనివారం, 7 ఆగస్టు 2021 (11:11 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణం తీశాయి. వైర్‌లెస్ గ్యాడ్జెట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒక్కసారిగా పేలడంతో యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. 
 
వైర్‌లెస్ గ్యాడ్జెట్ అయిన బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఒక్కసారిగా పేలడంతో యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. జైపూర్‌లోని చౌము ప్రాంతంలోని ఉదైపురియా గ్రామానికి చెందిన రాకేశ్ నగర్‌ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఫోన్‌ కాల్ మాట్లాడుతున్నాడు.
 
ఇంతలో అకస్మాత్తుగా ఆ బ్లూట్ ఇయర్‌ఫోన్ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక పేలుడు ధాటికి యువకుడి రెండు చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
కాగా, అపస్మారకస్థితిలో పడిపోయిన రాకేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తుండగా.. హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పేలిన సమయంలో అతడికి గుండెపోటు వచ్చి ఉంటుందని, ఆ కారణంగానే రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు