కరుణానిధితో రజినీకాంత్ గంటసేపు భేటీ... ఏం జరుగబోతోంది...?

శనివారం, 10 డిశెంబరు 2016 (21:43 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి కరుణానిధి అనారోగ్యం నేపధ్యంలో ఆయనను పరామర్శించేందుకు రజినీకాంత్ వెళ్లారని అంటున్నారు. కానీ అన్నాడీఎంకెలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో డీఎంకె చీఫ్ కరుణానిధియే రజినీకి కబురు పంపారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు అన్నాడీఎంకె పార్టీ కార్యదర్శి పదవిని శశికళ కైవసం చేసుకుంటారనే ఊహాగానాల నేపధ్యంలో రజినీకాంత్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే అమ్మ మరణంపైన నటి గౌతమి ప్రధానమంత్రికి లేఖ రాయడం, మరి భాజపా దీన్ని ఎలా పరిగణిస్తుందో చూడాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి