"వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా, దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని అందిస్తూ, సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ వినాయక చవితి. విద్య, జ్ఞానం ఉన్నవాడు గణాధిపత్యం వహించగలడని విద్య ప్రాధాన్యతను తెలిపే పండుగ కూడా. ఏటా బంధుమిత్రులతో వైభవోపేతంగా, ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితి జరుపుకునే వాళ్ళం. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా జ్ఞానం, శ్రేయస్సు, ఆదం, ఆరోగ్యాలను అందించే వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. అని ట్వీట్ చేశారు.