సినీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై అతని సోదరుడు మీనాజుద్దీన్ భార్య ఆఫ్రీన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా బుధానా పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా గతనెల 28వ తేదీన రాత్రి తనను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని కోరుతూ తన కడుపుపై నవాజుద్దీన్ కొట్టాడని ఆఫ్రీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మే 31వ తేదీన తాను మీనాజుద్దీన్‌ను పెళ్లాడానని అప్పటి నుంచి తనను అదనపు కట్నం తీసుకురమ్మని తన భర్తతో సహా అత్తింటివారు వేధిస్తున్నారని ఆఫ్రీన్ ఫిర్యాదు చేశారు. తన భర్త అసహజ సెక్స్ చేసేందుకు ప్రయత్నించాడని గర్భిణీ అయిన ఆఫ్రీన్ ఆరోపించారు. తనను భర్త మీనాజుద్దీన్ తోపాటు సినీనటుడు నవాజుద్దీన్, ఫయాజుద్దీన్, మజుద్దీన్, సైమాలు అదనపు కట్నం కోసం కొట్టి ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.