శత్రుదేశాలను తుత్తునీయలు చేసేందుకు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు మన దేశానికి చేరుకున్నాయి. 7,000 కిలోమీటర్లు ప్రయాణించి, అంబాలా వాయుసేన బేస్‌లో దిగాయి. అయితే తొలిగా వాటిని నడిపిన భారత పైలెట్లు ఎవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆ వీరులెవరంటే...
హర్‌కిరత్ సింగ్ (గ్రూప్ కెప్టెన్) : ఈ బృందానికి ఈయనే నాయకత్వం వహించారు. అత్యున్నత పురస్కారమైన ‘శౌర్యచక్ర’ ఈయనను వరించింది. 2008 లో ఓ మిషన్ చేపట్టిన సందర్భంలో దురదృష్ట వశాత్తు ఆయన ఏయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికై గురైంది. ఆ సమయంలో ఆయన చాలా మంది ప్రాణాలను కాపాడారు. వీరి తండ్రి కూడా వాయుసేనలో లెఫ్టినెంట్ కల్నల్‌గా సేవలందించారు.